epaper
Monday, January 19, 2026
spot_img
epaper

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావు‌కు బిగ్ రిలీఫ్

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ (KCR), హరీశ్‌రావుతో పాటు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిపై ఎలాంటి చర్యలు వద్దని చెప్పింది. తదుపరి విచారణ జరిగేంత వరకు ఇది అమలవుతుందని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ, తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.

జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రిపోర్టులో వీరిని నిందితులుగా పేర్కొనడంతో మాజీ సీఎస్ ఎస్కే జోషి కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశంతో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌లో ఏయే అంశాలను పేర్కొంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

కాళేశ్వరంలో (Kaleshwaram) ప్రాజెక్టులో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్‌‌ను (PC Ghose Commission) 2024, 14 మార్చిన నియమించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిజరేషన్ ప్రాజెక్ట్‌పై (KLIS) అవకతవకలు, ప్రణాళికలో లోపాలు, నిర్మాణ లోపాలు, నాణ్యత లాంటి అంశాలను పరిశోధించి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే.

Read Also: జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ నామినేషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>