epaper
Monday, January 19, 2026
spot_img
epaper

మేడ్చల్‌లో రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం డివిజన్ పరిధిలోని సింగారం రెవెన్యూ ప్రాంతంలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) కాపాడింది. సర్వే నెంబర్‌లో ఉన్న 6 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని ప్రముఖ విద్యా సంస్థల అధిపతి నల్ల మల్లారెడ్డి (Nalla Malla Reddy) కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ భూమిని తన విద్యాసంస్థల అవసరాలకు బదలాయించుకొనేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2009లోనే ఆయన ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు.  అయితే భూమి బదలాయింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ, ఈ భూమిని రెగ్యులరైజ్ చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని 50కిపైగా ప్లాట్లుగా విభజించినట్లు అధికారులు గుర్తించారు. భూమి పూర్తిగా కబ్జాకు గురవుతుందన్న సమాచారంతో హైడ్రా (HYDRAA) అధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు స్వాధీనం చేసుకున్నారు.  మరోవైపు, ఈ భూమిపై 1985లోనే కొందరు లేఔట్ వేసి ప్లాట్లు అమ్మినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై ఇంతకాలంగా జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Medchal
Medchal – Hydraa

Read Also: కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావు‌కు బిగ్ రిలీఫ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>