కలం, సినిమా : రాజాసాబ్‌తో థియేటర్స్‌లో సందడి చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). తాజాగా తన కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) సినిమా చేస్తున్న ప్రభాస్.. తన తరువాత మూవీ “కల్కి2” (Kalki 2) కోసం సిద్దం అవుతున్నారు. గత కొంతకాలంగా కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడయా వేదికగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అంతా సెట్ అయ్యిందని.. ప్రభాస్ డేట్స్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ నుంచి టాక్ వినిపిస్తుంది.
ఫిబ్రవరి నుంచి కల్కి 2 సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. కల్కి సినిమా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని రూపొందించారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన కథతో నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ సరికొత్తగా ప్రెజెంట్ చేశారు. సినిమా క్లైమాక్స్‌లో కర్ణగా ప్రభాస్‌ను చూపించడం సినిమాకే హైలైట్ గా మారింది.
అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, కమల్ హాసన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో కల్కి సినిమా రూపొందింది. అయితే కల్కి 2లో దీపిక తప్ప మిగతా వారంతా ఉంటారని తెలుస్తుంది. దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె ప్లేస్ లో ఎవర్ని తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


