కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) కాంగ్రెస్ పార్టీ సర్వంసిద్ధమైంది. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచించిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. మున్సిపల్ ఎన్నికలకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం మంత్రులకు కీలక బాధ్యతలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగబోయే ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్లవారీగా బాధ్యతలు అప్పగించారు. రేపట్నుంచే పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెట్టాలని సీఎం మంత్రులను ఆదేశించారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని సూచించారు.
పార్లమెంట్ నియోజకవర్గలవారీగా..
1. మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
2. చేవెళ్ల – శ్రీధర్ బాబు
3. కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
4. ఖమ్మం- కొండా సురేఖ
5. మహబూబాబాద్ – పొన్నం ప్రభాకర్
6. మహబూబ్ నగర్ – దామోదర రాజనర్సింహ
7. జహీరాబాద్ – అజారుద్దీన్
8. మెదక్ – వివేక్
9. నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీహరి
10. నల్లగొండ – అడ్లూరి లక్ష్మణ్
11. భువనగిరి – సీతక్క
12. నిజామాబాద్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
13. వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
14. పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
15. ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు


