కలం వెబ్ డెస్క్ : కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు (Karur Stampede Case) సంబంధించి సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేయడంతో టీవీకే అధినేత విజయ్ (Vijay Thalapathy) ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి ప్రైవేట్ విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఉదయం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ గతేడాది తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును (Karur Stampede Case) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రెండు వారాల క్రితం టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం గత వారం విజయ్‌కు కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జనవరి 12న సైతం విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.
Read Also: అమ్ముడుపోయిన వాళ్ల మధ్య ఉంటే అంతే సంగతి.. విజయసాయిరెడ్డి
Follow Us On: Sharechat


