కలం వెబ్ డెస్క్ : ఏపీని జూదాంధ్రప్రదేశ్గా మార్చేశారని ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర్రావు (Venkata Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయలో జరిగిన ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై పడ్డారని కారుమూరి విమర్శించారు. రాష్ట్రంలో పేకాట, కోడి పందేలతో పాలకులకు దోచుకో దాచుకో అన్నట్లుగా తయారైందన్నారు. గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవాలకు వెళ్లే వారని, ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని చెప్పారు. పాలకులకు ఎన్నికల హామీలపై శ్రద్ధ లేదు కానీ అక్రమ సంపాదన మీద, రాజకీయ కక్షల మీద మాత్రం ఆసక్తి ఉందని విమర్శించారు.
Read Also: దావోస్ వేదికపై తెలంగాణ వర్సెస్ స్వర్ణాంధ్ర
Follow Us On : WhatsApp


