కలం, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏపీ నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో ఏపీకి వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో రెండు రోజులుగా జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతోంది. అయితే సంక్రాంతి పండుగకు మూడు నాలుగు రోజులపాటు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోని తిరుగు ప్రయాణంలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో నల్గొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖ ట్రాఫిక్‌ను (Traffic) డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించింది. తిరుగు ప్రయాణానికి ముందుగానే పోలీసు శాఖ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వివిధ రూట్లకు ట్రాఫిక్ ను మళ్లించేందుకు పలు సూచనలు చేశారు.
ఎటువైపు నుంచి వచ్చేవాళ్లు ఎటు వెళ్లాలని దానిపై ముందుగానే క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. యథావిధిగానే హైదరాబాద్ విజయవాడ (Hyderabad – Vijayawada) జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం అమావాస్య ఉందంటూ సెలవు ఉన్నప్పటికీ శుక్ర, శనివారాల్లోనే సగానికి పైగా వాహనాలు హైదరాబాద్ వైపు బయలుదేరాయి. ఆదివారం అమావాస్య సెంటిమెంటు నేపథ్యంలో వాహనాలు పెద్దగా రోడ్ ఎక్కవని అంతా భావించారు. కానీ సోమవారం వర్కింగ్ డే ఉండటంతో అమావాస్య సెంటిమెంటును పక్కకు పెట్టి పట్నం బాట పట్టారు. ప్రధానంగా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలతో పాటుగా చిట్యాల పరిధిలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ల వద్ద వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
Read Also: మంత్రులపై రేవంత్ కుట్రలు: జగదీష్ రెడ్డి
Follow Us On: Sharechat


