కలం వెబ్ డెస్క్ : 77వ గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎట్-హోమ్’ ఆహ్వాన పత్రాన్ని(At Home invitation) అతిథులకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఆహ్వాన పత్రాన్ని భారతదేశంలోని నార్త్ ఈస్ట్ జీవన సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ పత్రంలో ఆ ప్రాంతంలోని నైపుణ్యం గల కార్మికులు, కళాకారుల కృషి, వారి సంప్రదాయ కళలు, వస్తువుల రూపకల్పన అందంగా చూపించారు.
ఈ ఆహ్వాన పత్రాన్ని అష్టలక్ష్మీ రాష్ట్రాల సంప్రదాయ కళలను గౌరవించే విధంగా రూపొందించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రత్యేకంగా నార్త్ ఈస్ట్‌లోని వివిధ రాష్ట్రాల వాణిజ్య, శిల్ప, వస్త్ర కళా నైపుణ్యాలను ప్రదర్శించేలా చిన్న పుస్తకాలు, కళాకృతి నమూనాలు, హస్తకళా వస్తువులు ఇందులో పొందుపర్చినట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సంప్రదాయాలను, కళలను ప్రోత్సహించడం కోసం రాష్ట్రపతి ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read Also: ట్రాఫిక్ డైవర్ట్ చేసినా తీరని కష్టాలు..!
Follow Us On: Sharechat


