కలం, తెలంగాణ బ్యూరో : దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో (Davos Summit) రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడనున్నాయి. వేటికవిగా విజన్ డాక్యుమెంట్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ముందు ప్రదర్శించనున్నారు. స్వర్ణాంధ్ర పేరుతో చంద్రబాబునాయుడు, తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్‌రెడ్డి విడివిడి విజన్ డాక్యుమెంట్లను వివరించనున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ సదస్సుకు హాజరవుతున్న దృష్ట్యా పెట్టుబడుల ఆకర్షణలోనూ పోటీ పడనున్నారు. ముఖాముఖి కలుసుకుని వీరిద్దరూ మాట్లాడుకుంటారేమోననే ఆసక్తికర చర్చలు రెండు రాష్ట్రాల ప్రజల్లో నెలకొన్నది.
భారీగా పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన కొనసాగనున్నది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారమే దావోస్‌కు (Davos Summit) బయలుదేరివెళ్ళారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం బయలుదేరనున్నారు. సదస్సులో చంద్రబాబు టీమ్ ‘స్వర్ణాంధ్ర విజన్ –2047’పై (Swarnandhra Vision 2047) ప్రజెంటేషన్ ఇవ్వనుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను వివరించనుందిప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి టీమ్ ‘తెలంగాణ విజన్ –2047’పై (Telangana Vision 2047) ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నది. ఫ్యూచర్ సిటీతో పాటు ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ విధానాన్ని ప్రస్తావించనుంది. ఈ నెల 24న రేవంత్ రెడ్డి దావోస్ నుంచి అమెరికాకు వెళ్తారు. ఫిబ్రవరి 1న తిరిగి వస్తారు.
Read Also: టీడీపీని తొక్కేసిన బీఆర్ ఎస్ ను బొందపెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


