epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

రిటర్న్ జర్నీ.. ఫుల్ రష్

కలం, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగకు పల్లెలకు వెళ్లిన జనం మళ్లీ సిటీ బాటపడ్తున్నారు. దీంతో హైవేలన్నీ ట్రాఫిక్ జామ్ (Huge Traffic Jam) అవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ (Vijayawada to Hyderabad) వచ్చే నేషనల్ హైవే 65పై (NH 65) వాహనాల రద్దీ భారీగా ఉంది. శనివారం ఉదయం 11 గంటల తర్వాత నుంచి వెహికల్స్ మూవ్ మెంట్ మొదలైంది. చిట్యాల వద్ద ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతుండటంతో వాహనాల కదలిక స్లోగా ఉంది. ఆ రూట్ లో బస్సులు, కార్లు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

రాత్రి కూడా ఇదే పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా హైదరాబాద్ వైపు పంపిస్తున్నారు. మరో ఒకటీ రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు జనం వెళ్లినప్పుడు (ఈ నెల 9 నుంచి 14 వరకు) పంతంగి టోల్ ప్లాజా (Panthangi Toll Plaza) మీదుగా భారీగా వాహనాలు కదిలాయి. గంటకు 3 వేలకుపైగా వెహికల్స్ అటుగా వెళ్లాయి. ఇప్పుడు రిటర్న్ జర్నీలోనూ అదే స్థాయిలో వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది.

Read Also: 40 మందిని కాపాడి.. తాను తనువు చాలించి!!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>