కలం, వెబ్ సైట్ : హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే సింగూరు ఫేజ్-3 ప్రధాన పైప్‌లైన్‌కు (Singur Pipeline) ఏర్పడిన భారీ లీకేజీల కారణంగా జలమండలి అత్యవసర మరమ్మతులు చేపట్టింది. ఈ పనుల దృష్ట్యా రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా (Water Supply)లో అంతరాయం కలగనుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు.
పైప్‌లైన్‌కు మరమ్మతులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. నీటి సరఫరా లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు పంపేలా ప్రణాళిక సిద్ధం చేయాలని జీఎంలకు సూచించారు.
Read Also: కేంద్రం నిధులతో రాష్ట్రం రాజకీయం: రాంచందర్ రావు
Follow Us On: Sharechat


