కలం, డెస్క్: రేషను కార్డులున్న ప్రతీ కుటుంబానికి నెలకు రూ. 2 వేల చొప్పున ఇస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా రేషనుకార్డు పెద్ద బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుందని ఎన్నికల మేనిఫెస్టోలో (AIADMK Manifesto) ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం సిటీ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వెసులుబాటు ఉన్నదని, కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇకపైన పురుషులకూ కూడా ఫ్రీ జర్నీ (Free Journey) సౌకర్యాన్ని కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.
ప్రస్తుతానికి కొన్ని హామీలను మాత్రమే తాము ప్రకటిస్తున్నామని, పూర్తి స్థాయిలో హామీలను (AIADMK Manifesto) త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మాత్రమే సొంతిల్లు లేని కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చి అందులో కాంక్రీటు ఇంటిని నిర్మించే స్కీమ్ ఉన్నదని, ఇకపైన పట్టణాల్లో కూడా ఇదే తరహా పథకాన్ని తీసుకొస్తామన్నారు.
Read Also: ఇరాన్ నుంచి ఢిల్లీ చేరిన భారతీయులు
Follow Us On : WhatsApp


