కలం, వెబ్ డెస్క్: అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుసగా సంక్రాంతి బ్లాక్ బస్టర్లను అందించి తెలుగు సినిమా రంగంలో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2025లో ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమాతో భారీ విజయం సాధించిన ఆయన చిరు మూవీతో దాదాపు రూ. 260 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగలిగాడు. మార్కెట్‌లో అనిల్ రావిపూడి రేంజ్ పెరగడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచాలని డిసైడ్ అయ్యాడు.
బోయపాటి శ్రీను (Boyapati Srinu) అఖండ2కి దాదాపు రూ. 30 నుంచి 35 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఒక్కో సినిమాకు దాదాపు రూ.18 కోట్లు తీసుకుంటున్నాడట. ప్రస్తుత సక్సెస్ రేటును దృష్టిలో పెట్టుకొని రాబోయే ప్రాజెక్టుల కోసం రూ. 30 కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే అఖండ2కు భారీ నష్టాలు రావడంతో బోయపాటి 25 కోట్లకు మించి ఇవ్వకపోవచ్చునని తెలుస్తోంది. వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావిపూడి పారితోషికం విషయంలో బోయపాటిని అధిగమించాడని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. చిరు మూవీ మంచి విజయం సాధించడంతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) నెక్ట్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.
Read Also: మరో రికార్డు సృష్టించిన చిరు సినిమా!
Follow Us On : WhatsApp


