కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పై, కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ వద్ద గల బ్రిడ్జి పై నెత్తురు చిందింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Khammam) 12మంది గాయపడ్డారు. రెండు కార్లు ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంక్ ను ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇదే గ్రీన్ ఫీల్డ్ హైవే పై వైరా – తల్లాడ మధ్యలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొత్తగూడెం పరిధిలోని సుజాతనగర్ మండలం మంగపేట వద్ద గల బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం (Kothagudem) వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కల్లూరుకు చెందిన నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్న వారే ప్రమాదాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున మంచు అధికంగా కురవడం కూడా ఈ యాక్సిడెంట్ లకు ఒక కారణంగా కనిపిస్తోంది.

Read Also: క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫుడ్, స్కిల్ పైన దృష్టి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


