కలం, వెబ్ డెస్క్ : AI వస్తే జాబులు ఎక్కువగా పోతుండటం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వస్తువుల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ ట్యాప్ ల ధరలు భారీగా పెరగబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటి ఏఐకు (AI) ఈ ధరల పెరుగుదలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఇక్కడే చిన్న లింక్ ఉంది. ఏఐ (AI)ని ప్రతి సంస్థ అడాప్ట్ చేసుకుంటోంది. దీంతో భారీగా మెమొరీ చిప్స్ వాడేస్తున్నాయి డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లు. ఏఐని అడాప్ట్ చేసుకుంటున్న ప్రతి కంపెనీ లెక్కకు మించి మెమొరీ చిప్స్ ను ఆర్డర్ చేస్తున్నాయి.
దీంతో టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ ఫోన్ లను తయారు చేస్తున్న కంపెనీలకు మెమొరీ చిప్స్ కావాల్సినన్ని దొరకట్లేదు. ఆర్డర్ చేసిన మెమొరీ చిప్స్ లలో సగం కూడా ఆ కంపెనీలకు డెలివరీ కావట్లేదంట. ఇదే విషయాన్ని ప్రముఖ టీవీల కంపెనీ సూపర్ ప్లస్ట్రోనిక్స్ తెలియజేస్తోంది. పైగా చిప్స్ కు డిమాండ్ భారీగా ఉండటంతో గతంలో ఉన్న ధరల మీద 50 శాతం పెరిగాయి. ఈ ఎఫెక్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల ధరల మీద పడింది. ఇప్పటికే వివో, నథింగ్ లాంటి కంపెనీలు ధరలను పెంచేశాయి. రియల్ మీ, రెడ్ మీ, శాంసంగ్, వన్ ప్లస్ లాంటి పెద్ద కంపెనీలు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను 90 శాతం మేర తగ్గించేశాయి.
వచ్చే మూడు నెలల్లో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగొచ్చని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. గత నెలలో స్మార్ట్ టీవీల ధరలు 3 శాతం, ల్యాప్ ట్యాప్ ల ధరలు 6 శాతం పెరిగాయి. ప్రస్తుతం మెమొరీ చిప్స్ కొరత ఇంకా కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. సమ్మర్ వరకు ఈ మూడు వస్తువుల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.


