కలం, వెబ్‌డెస్క్: ఇంటర్, తత్సమాన(10+2) విద్యార్థులకు సూపర్ ఆఫర్. భారత నేవీ (Indian Navy) లో రూ.లక్షకు పైనే జీతంతో ఉద్యోగంలో స్థిరపడే అవకాశం. ఈ మేరకు ఇండియన్ నేవీ 10+2 బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎంపికైనవాళ్లు ఎలిమల(కేరళ)లోని ఇండియన్ నేవీ అకాడమీలో ఉచితంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సును పూర్తిచేయడంతోపాటు పర్మనెంట్ ఆఫీసర్‌గా కొలువు పొందవచ్చు. ఎంపికైతే నెలకు కనీసం రూ.లక్షతో జీతం మొదలవుతుంది.
వివరాలు:
కోర్స్: 10+2 (బీటెక్) క్యాడెట్ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమిషన్)
బ్రాంచ్: ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్
ఖాళీలు: 44(ఇందులో 7 కచ్చితంగా మహిళలకు కేటాయిస్తారు)
అర్హతలు:
అభ్యర్థులు 02 జనవరి 2007 – 01 జులై 2009 మధ్య జన్మించి, అవివాహితులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా ఇంటర్/తత్సమాన విద్యలో ఇంగ్లీష్‌లో 50శాతం మార్కులు వచ్చి తప్పనిసరి. బీఈ/బీటెక్‌లో ప్రవేశం కోసం జేఈఈ(మెయిన్) ఎగ్జామ్ రాసి ఉండాలి. దీని ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కామన్ ర్యాంక్ లిస్ట్ –2025 ప్రకారం సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం శారీరక దృఢత్వ పరీక్షలు, ఆరోగ్యం పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత ఎత్తు, బరువు ఉండాలి. అన్నింటిలో ప్రమాణాలు అందుకున్నవాళ్లు ఎలిమలలో బీటెక్ శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం నేవీలో ఉద్యోగిగా నియమిస్తారు. ప్రారంభ జీతం రూ.లక్షకు పైనే ఉంటుంది.
దరఖాస్తు: నేవీ వెబ్సైట్ www.joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆఖరు తేదీ: జనవరి 19, 2026.
నోట్: పూర్తి వివరాలకు నేవీ వెబ్సైట్ లోని నోటిఫికేషన్లో ఉన్న వివరాలను జాగ్రత్తగా చదవగలరు.


