కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ వేదికపై భారత ప్రజాస్వామ్య మూలాలను, గొప్ప సంప్రదాయాలను ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకోవడం తనకు దక్కిన ఒక మరపురాని అనుభవమని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సులో (CSPOC Meet) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని ప్రధాని మోడీ (Narendra Modi) పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మన దేశంలోని లోతైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ పద్ధతులు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టసభలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
Read Also: తడబడినా బోణీ కొట్టిన యువ భారత్
Follow Us On: Pinterest


