కలం, సినిమా : ప్రపంచ యాత్రికుడిగా పేరుపొందిన నా అన్వేష్(Youtuber Anvesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు చుట్టేస్తూ అక్కడి ప్రత్యేకతలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సుమారు 70 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న నా అన్వేష్ ఈ మధ్య తనకు సంబంధంలేని ఇష్యూలో తలదూర్చి భారీగా ఫాలోవర్స్ ను కోల్పోయాడు. అంతే కాదు ఆ ఇష్యూ మూలంగా నా అన్వేష్ పై ఇక్కడ పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.
తాజాగా అన్వేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నేను ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే 130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. ప్రస్తుతం నా దగ్గర 8కోట్లు ఉన్నాయి. వీటితో “మీకోసం కాదు ఇకపై నాకోసం మిగిలిన దేశాలు తిరుగుతాను. ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుతాను” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం అన్వేష్ (Youtuber Anvesh) చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నా అన్వేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: షాకింగ్.. చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి
Follow Us On: X(Twitter)


