కలం, వెబ్ డెస్క్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బీటెక్ విద్యార్థులకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) శుక్రవారం సాయం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లికి చెందిన నవీన్, అజయ్‌లకు ఫీజుల నిమిత్తం నగదు సాయం కావాల్సి ఉంది. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో నవీన్ తండ్రి చిన్రాజు సత్తయ్య మరణించగా, అజయ్ తండ్రి పెద్దోళ్ల సాయి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఆర్థికంగా ఫీజులు (Fees) చెల్లించలేని పరిస్థితి ఉండటంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను ఆశ్రయించారు. ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజుల కోసం కేసీఆర్ చెక్కులను అందించారు.


