epaper
Monday, March 2, 2026
epaper

‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను సీఎం తనిఖీ..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ ‘పెట్ అండ్ ప్లే పార్క్(Pay and Play Park)’ పనులను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుక్రవారం తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో పార్క్ వద్ద ఆగి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చెత్తా చెదారంతో నిండిన ఆ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా, పార్క్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారు గతంలో జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్క్‌లో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి ఆకస్మికంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్క్‌లో పనిచేస్తున్న కూలీలకు ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: జూబ్లీ పోటీలో తుదిపోరుకు ఎంతమందంటే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!