కలం, స్పోర్ట్స్: ఇప్పటికే టీ20 క్రికెట్లో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. టెస్టుల్లోనూ అదే స్థాయిలో రాణించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (Alastair Cook) ఆకాంక్షించారు. మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగే ప్రతిభ అతడిలో ఉందని ప్రశంసించారు. సూర్యవంశీ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని కుక్ పేర్కొన్నారు. సూర్యవంశీ బంతిని బలంగా బాదడమే కాకుండా, వేగంగా వచ్చే బంతులను కూడా అంచనా వేసి సిక్సర్లుగా మలచగలుగుతున్నాడని కుక్ అన్నారు.
అతడి బ్యాటింగ్‌లో నిలకడ కూడా ప్రత్యేకమని కుక్ (Alastair Cook) అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని గుర్తుచేశారు. ప్రతి తరానికి యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే ఒక క్రికెటర్ అవసరమని కుక్ అన్నారు. సూర్యవంశీ వైట్‌బాల్ క్రికెట్లో చూపిస్తున్న ఆధిపత్యాన్ని టెస్టుల్లోనూ కొనసాగిస్తే, సంప్రదాయ క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టుల్లో రాణించడం సవాలుతో కూడుకున్నదని, అందులో ప్రయత్నించేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

