పాలేరుకు సాగర్ జలాల పరవళ్లు!

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి పాలేరు జలాశయానికి (Palair Reservoir) నీటి పరవళ్లు కొనసాగుతున్నాయి. తాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు నీటి ప్రవాహంపై పక్కా నిఘా ఏర్పాటు చేశారు. ​ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, అందులో 1,500 క్యూసెక్కుల నీరు పాలేరు జలాశయానికి చేరుతోంది. జలాశయంలోకి నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

​ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) వెంకటేశ్వరరావు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పాలేరు జలాశయానికి (Palair Reservoir) చేరుతున్న నీటి పరిమాణాన్ని, అలాగే జలాశయంలోని ప్రస్తుత నీటి మట్టాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఎస్ఈ వెంకటేశ్వరరావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తాగునీటి కోసం విడుదల చేస్తున్న జలాలు ఎక్కడా వృథా కాకుండా, దుర్వినియోగం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాలువలు, జలాశయ పరిసరాల్లో అక్రమంగా నీటిని తోడటం లేదా ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>