కలం, కరీంనగర్ : పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం కేఎన్ఆర్ మార్నింగ్ వాక్‌లో భాగంగా 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలోని (Teegalaguttapally) అంబేద్కర్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కాలనీవాసులను పలకరిస్తూ ఇందిరమ్మ కుటుంబ బీమాపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అర్హత ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని వారు తమ సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వారి వివరాలను సేకరించిన ఆయన, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్, కొలగాని అనిల్, మెతుకు కాంతయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కూన దామోదర్, ఎట్టెపు వేణు, అంజయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

