ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను పకడ్బందీగా అమలు చేయలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా.

కలం, ఆదిలాబాద్: ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమలు, పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల తనిఖీలను ఎలా నిర్వహించాలి, విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ ఎలా చేయాలి, పాఠశాలలో ఏజీఆర్ వివరాలను ఎలా నమోదు చేయాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో టీఎల్‌ఎం (బోధనోపకరణాలు) వినియోగం మరింత పెరగాలని సూచించారు. పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు గణిత చతుర్విధ ప్రక్రియలు తప్పనిసరిగా రావాలని అన్నారు. జిల్లాలోని 57 పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఏఐ ఎక్సెల్ కార్యక్రమం పురోగతిపైనా చర్చించారు.

కొన్నిచోట్ల ఎదురవుతున్న నెట్‌వర్క్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఏఎంవో లక్ష్మణ్‌ను ఆదేశించారు. జిల్లాలోని 109 ఉన్నత పాఠశాలల్లో అమలవుతున్న ఖాన్ అకాడమీ కార్యక్రమంలో ప్రతి పాఠశాల నుంచి కనీసం 50 శాతం మంది విద్యార్థులు యాక్టివేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు. 50 శాతం కంటే తక్కువ యాక్టివేషన్ ఉన్న పాఠశాలల్లో రాబోయే ఏడు రోజుల్లో ఆ సంఖ్య 50 శాతం దాటేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను కోరారు.

అనంతరం ఖాన్ అకాడమీ విజయవంతంగా అమలు చేస్తున్న గాదిగూడ మండలం మల్లాపూర్ యూపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ కృష్ణను కలెక్టర్ శాలువాతో సత్కరించి ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో డీఈవో మాధవి, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, రఘురమణ, తిరుపతి, జిల్లాలోని 21 మండలాల ఎంఈవోలు, 71 స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, జిల్లా, మండల ఎఫ్‌ఎల్‌ఎన్, ఇన్‌స్పెక్షన్ టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>