సిరాజ్‌కు టీమ్‌లో ప్లేస్ ద‌క్క‌క‌పోవ‌డం అవ‌మాన‌మే: అశ్విన్‌

క‌లం, స్పోర్ట్స్: జట్టులో స్థానం ఇవ్వకపోవడంతో సిరాజ్‌కు మేలు చేస్తున్నాం అని అనుకోవద్దంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఘాటు వ్యాఖ్యలు చేశారు. జట్టులో ప్లేస్ దక్కకపోవడం సిరాజ్‌కు అవమానమేనన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. హాగ్లీ ఓవల్ మ్యాచ్‌లో వరుసగా రెండోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ ప్రణాళికలపై సందేహాలు మొదలయ్యాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సిరాజ్ 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌తో 2-2 సిరీస్ డ్రాలోనూ కీలకంగా నిలిచాడు. అయినా నలుగురు పేసర్లతో ఆడుతున్నా సిరాజ్‌ను పక్కన పెట్టారు. అవకాశం రాకపోవడంతో సిరాజ్ కళ్లద్దాలు పెట్టుకుని కళ్లను దాచుకుంటూ కనిపించాడు.

ఈ దృశ్యాలపై అజింక్య రహానే, మురళీ కార్తీక్ స్పందించారు. సిరాజ్ ఏడుస్తున్నాడా అని కార్తీక్ అడిగాడు. సిరాజ్ సున్నిత మనస్కుడని, వన్డేలు, వెస్టిండీస్ సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితం చేయడం అతడిని బాధించి ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఫామ్ లేకపోతే అసలు పర్యటనకే తీసుకోకూడదని ప్రశ్నించాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా సిరాజ్‌కు అండగా నిలిచాడు. పేసర్ల వరుసలో నితీశ్ కుమార్ రెడ్డి కంటే సిరాజ్ వెనుకబడ్డట్లు కనిపిస్తోందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పాడు. గుర్నూర్ బ్రార్‌ను చేర్చినప్పుడే సిరాజ్ ఆడడని తనకు అర్థమైందని తెలిపాడు. పాత ఆటగాళ్లను పక్కన పెట్టి మేనేజ్‌మెంట్ ముందుకు వెళ్తోందని అన్నాడు. తదుపరి అవకాశంలో 145 కిలోమీటర్ల వేగంతో ఐదు వికెట్లు తీస్తేనే సిరాజ్‌కు భవిష్యత్తు ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>