విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి: సుదర్శన్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) సూచించారు. నవీపేట మండలం మోకన్ పల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 80 లక్షల పైచిలుకు నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ లను శనివారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.

పాఠశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని, నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నామని అన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే విషయంలో ప్రభుత్వం ఎంతమాత్రం రాజీ పడబోదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన ఏకరూప దుస్తులతో పాటు షూ, టై, బెల్ట్ వంటి అన్ని వసతులు సమకూరుస్తున్నామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా సాంకేతిక విద్యకు తోడ్పాటును అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఇంచార్జి డీ.ఈ.ఓ సాయాగౌడ్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత, స్థానిక సర్పంచ్ విరీష, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>