గీతా ఆర్ట్స్‌కు జ‌క్క‌న్న స‌ల‌హా.. యంగ్ ప్రొడ్యూసర్స్‌కు కౌంట‌ర్‌!

క‌లం, సినిమా: స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) లేటెస్ట్‌గా ఆకాశంలో ఒక తార స‌క్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మూవీ టీమ్‌తో పాటు ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ ప్రోగ్రామ్‌లో అల్లు అర‌వింద్‌కు రిక్వెస్ట్ చేస్తూ యంగ్ ప్రొడ్యూస‌ర్స్‌పై రాజ‌మౌళి చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. నిర్మాత‌గా అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యాన‌ర్‌పై ఎన్నో స‌క్సెస్‌ఫుల్ సినిమాలు చేశారు. అయితే కొన్నేళ్ల నుంచి ఇత‌ర యంగ్ ప్రొడ్యూస‌ర్ల‌తో క‌లిసి సంయుక్తంగా సినిమాల‌ను నిర్మిస్తున్నారు. దీనిపై రాజ‌మౌళి స్పందిస్తూ ‘మీరు ఈ మ‌ధ్య గ‌ర్ల్ ఫ్రెండ్‌, ఏవోటీ, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి వంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీస్తున్నారు. నాకు ఈ విష‌యంలో సంతోషంగా ఉంది. కానీ, మీరు సొంతంగా, సోలోగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు.. తీయాలి లేదంటే ఈ చిన్న ప్రొడ్యూస‌ర్లు మీకు క్రెడిట్ ఏం ద‌క్క‌నివ్వ‌రు.. మొత్తం లాక్కెళ్లిపోతారు’ అని కామెంట్ చేశారు.

దీంతో అల్లు అర‌వింద్ (Allu Aravind) స‌హా ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్లంతా నవ్వేశారు. అయితే దీనిపై చిన్న ప్రొడ్యూస‌ర్లు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అల్లు అర‌వింద్ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ వాసు, ఎస్‌కేఎన్, భాను ప్ర‌తాప‌, రియాజ్ చౌద‌రి వంటి చిన్న ప్రొడ్యూస‌ర్ల‌తో క‌లిసి ప‌ని చేశారు. ఇందులో ఎక్కువ‌గా బ‌న్నీ వాసుతోనే క‌లిసి సినిమాలు నిర్మించారు. రాజ‌మౌళి (SS Rajamouli) చెప్పిన‌ట్లుగా ఆయా సినిమాల ప్ర‌చారం, కార్య‌క్ర‌మాల్లో చిన్న ప్రొడ్యూస‌ర్ల‌దే హడావుడి ఉంటుంది. అయితే జ‌క్క‌న్న చేసిన కామెంట్ల‌ను వారు ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.

ఇక ఆకాశంలో ఒక తార సినిమా దుల్క‌ర్ సల్మాన్‌, సాత్విక వీర‌వ‌ల్లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌వ‌న్ సాధినేని డైరెక్ష‌న్‌లో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై తెర‌కెక్కింది. ఈ సినిమాను సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ మూవీ గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థల స‌మ‌ర్ప‌ణ‌లో విడుద‌లైంది. విడుద‌లైన మొద‌టి రోజు నుంచే ఆకాశంలో ఒక తార పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Also Read : విశ్వక్‌సేన్‌ ‘లెగసీ’ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>