కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. సమాజంలోని అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.
మహిళా విద్యకు ఆయన వేసిన పునాదులు నేటి ఆధునిక సమాజానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. నేటి యువత మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన చూపిన సేవా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

