కలం, వెబ్ డెస్క్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)పై కీలక ముందడుగు పడింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను పార్లమెంట్ లో పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం రాష్ట్రపతి ఈ సిఫార్సు చేశారని లోక్ సభ సెక్రటరీ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్య 850కి పెరగనుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా 2051 వరకు సీట్ల కేటాయింపులు కొనసాగించేలా ఈ బిల్లు కేంద్ర ప్రతిపాదనలు చేసింది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు కూడా ఈ బిల్లు ద్వారా మార్గం సుగమం కానుంది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో డీలిమిటేషన్ బిల్లును (Delimitation Bill) ప్రవేశ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Also Read : డీ లిమిటేషన్ ఒప్పుకోం.. బీజేపీ టార్గెట్ అదే: ఖర్గే
Follow Us On : WhatsApp

