కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’(Legacy Movie) విడుదల వాయిదా పడింది. సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు విశ్వక్సేన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. శక్తి, ప్రేమ, రక్తసంబంధాలు, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోంది. కలాహి మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. కేకే మీనన్, ఏక్తా రాథోడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

