డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం : డీజీపీ సివి ఆనంద్

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా (Drug-Free State) మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సమస్య దేశవ్యాప్తంగా సవాల్‌గా మారిందన్నారు. ప్రధాని నేతృత్వంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం కొనసాగుతోందని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మావోయిస్టులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందని, అదే విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు సాధారణ జీవనంలోకి తిరిగి వచ్చేలా పోలీసుల తరఫున సహకారం అందిస్తున్నామని తెలిపారు. నార్కోటిక్స్ నియంత్రణలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. గంజాయి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ బ్యూరో ప్రత్యేకంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించినట్లు తెలిపారు. 27 ఏళ్ల తర్వాత నిజామాబాద్‌కు రావడం ఆనందంగా ఉందని, గతంలో ఇక్కడ మూడున్నరేళ్లు పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జిల్లా శాంతిభద్రతలు, పోలీసింగ్ అవసరాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>