ఎస్సై పరీక్షకు పటిష్ట బందోబస్తు.. 163 BNSS ఆంక్షలు

​కలం, కరీంనగర్ : ఆదివారం (నవంబర్ 29) ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షకు (SI Preliminary Exam) కరీంనగర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మాల్‌ప్రాక్టీస్, అవాంఛనీయ సంఘటనల నివారణకు సెక్షన్ 163 BNSS నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం ప్రకటించారు. ​20 పరీక్షా కేంద్రాల్లో 14,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్న నేపథ్యంలో 1-టౌన్, 2-టౌన్, 3-టౌన్, ఎల్‌ఎండీ కాలనీ, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ఈ పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం పూర్తిగా నిషేధం. పరిసరాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించనున్నారు. ​చీఫ్ సూపరింటెండెంట్ మినహా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే పోలీసులకు, సిబ్బందికి సైతం సెల్‌ఫోన్ల అనుమతి లేదు. ముఖ్య కేంద్రాల్లో DFMD తనిఖీలతో పాటు పరీక్షకు ముందే గదులు, టాయిలెట్లను తనిఖీ చేసి కాపీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి 168 మందికి ఒకరు చొప్పున బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల సీసీటీవీ, సాయుధ బలగాల పహారా ఉంచారు. ప్రశ్నపత్రాలను ఆటోలు, బైక్‌లపై కాకుండా కేవలం క్లోజ్డ్ వాహనాల్లోనే తరలించాలని ఆదేశించారు. అభ్యర్థులు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది, అత్యవసర వైద్య సేవలకు నిషేధాజ్ఞల నుండి మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>