కలం, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) స్పిరిట్ మూవీపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్‌ను స్పిరిట్ మూవీ మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్‌తో జరిగిన ఇంటర్వ్యూలో స్పిరిట్ కు సంబంధించిన విషయాలను సందీప్ పంచుకున్నారు. తాను ఇంటర్వ్యూకు రావడానికి కొద్దిసేపటి ముందు మూవీ సంబంధించిన కొన్ని సన్నివేశాల ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటీకే ప్రభాస్ స్పిరిట్ (Spirit Movie) కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి మాటలతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇంతకముందు ఎప్పుడూ చూపించని విధంగా ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనుండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. ఇక విలన్ గా వివేక్ ఒబెరాయ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇప్పటికే తనకంటూ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
Also Read : స్విట్జర్లాండ్ చర్చిలో అన్నమయ్య సంకీర్తనలు!
Follow Us On : WhatsApp

