కలం, వెబ్ డెస్క్: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా మహిళా కలెక్టర్ పైనే లైంగిక వేధింపులకు పాల్పడి అరెస్ట్ అయ్యాడు. తమిళనాడులో కలెక్టర్ కు అసభ్యకర సందేశాలు పంపించిన కళ్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి.అరుళ్ విఘ్నేష్ (Arul Vignesh) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్యకర సందేశాలు పంపడం, అనుచితంగ ప్రవర్తించడంతో పాటు మద్యం మత్తులో తన అధికారిక నివాసంలో చొరబడేందుకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరుళ్ (Arul Vignesh) పై ఫిర్యాదు నమోదు కావడంతో గతంలో పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుపై స్పందించిన మద్రాసు హైకోర్టు ఎమ్మెల్యే పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు జోక్యం చేసుకోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు అరుళ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : స్విట్జర్లాండ్ చర్చిలో అన్నమయ్య సంకీర్తనలు!
Follow Us On : WhatsApp

