రేపే నవోదయ ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

కలం, నిర్మల్: కాగజ్‌నగర్‌లోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం శనివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష(Entrance Exam)కు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 5,756 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆదిలాబాద్ లో నాలుగు కేంద్రాల్లో 1,082 మంది, నిర్మల్ లో ఎనిమిది కేంద్రాల్లో 1,737 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ లో ఐదు కేంద్రాల్లో 1,360 మంది, మంచిర్యాలలో ఏడు కేంద్రాల్లో 1,577 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 10:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. సాంకేతిక కారణాలతో అడ్మిట్ కార్డు పొందలేని వారు సంబంధిత విద్యాలయంలో సంప్రదించాలని, నవోదయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>