కలం, వెబ్డెస్క్: ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లి దేశం కాని దేశంలో ఊహించని చిక్కుల్లో పడ్డ తెలుగు విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అండగా నిలిచారు. ఆమెకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ మేరకు జర్మనీలో చదువుకుంటున్న పరిమళ అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డికి థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేశారు. గతంలో సైతం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆమె చదువుల కోసం రూ.10 లక్షలు మంత్రి అందించారని తెలిపారు. అప్పుడే భవిష్యత్తులోనూ ఆమె చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
జర్మనీ వెళ్లిన తర్వాత డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ నిలిచిపోవడంతో పాటు, పరిమళ బ్యాంకు ఖాతా బ్లాక్ అయినట్లు తెలిపారు. దీంతో ఖాతాలోని డబ్బులు తీసుకోలేక రోజువారీ ఖర్చులకు ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి, డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రోజువారీ ఖర్చులకు లోటు లేకుండా మరో రూ.6 లక్షలు అందజేశారు.
కష్టకాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy)కి పరిమళ జర్మనీ నుంచి వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తూ మంత్రి తన గొప్ప మనసు చాటుకుంటున్నారని కొనియాడారు. ప్రస్తుతం పరిమళ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కష్టాల్లో ఉన్న విద్యార్థిని మంత్రి అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మంత్రిని అభినందిస్తూ నెటిజన్లు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు.
Also Read : రుద్రయాగం.. పులకించిన తిరుమల కపిలేశ్వరాలయం
Follow Us On : WhatsApp

