జగపతిబాబు సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్!

కలం, సినిమా: వెండితెరపై విలన్‌గా, గంభీరమైన పాత్రలతో మెప్పించే నటుడు జగపతిబాబు(Jagapathi Babu). నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సరదాగా, నిరాడంబరంగా ఉంటారు. స్టార్ హోదాను పక్కనపెట్టి సామాన్యులతో సులువుగా కలిసిపోతారు. తాజాగా ఆయన చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగపతిబాబు వర్కర్లతో కలిసి భోజనం చేసిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ తెప్పించి, అందరితో కలిసి భోజనం చేశారు. ఆయన ఆప్యాయత, నిరాడంబరత నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఒకప్పుడు సంపన్న కుటుంబంలో పుట్టిన జగపతిబాబు, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మళ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఆయనలోని సింప్లిసిటీ మారలేదు. సంపద, హోదా కంటే మనుషులతో కలిసుండటంలోనే ఆనందం ఉందని తన చర్యతో చాటిచెప్పారు. ఈ గ్రేట్ జెస్చర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>