కలం, వెబ్ డెస్క్ : భాగ్యనగర వాసుల రవాణా కష్టాలను తీరుస్తూ హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రతిష్టాత్మక మెట్రో సేవలను ప్రారంభించారు.
గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ మెట్రో నగర జీవనంలో ఒక భాగమైపోయింది. ఈ పదేళ్ల ప్రయాణంలో ఏకంగా 100 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మెట్రో సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు.
నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం, అలాగే ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మార్గాల్లో మొత్తం 57 స్టేషన్ల మీదుగా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతిరోజూ 1,100 ట్రిప్పులు తిరుగుతూ నగర రవాణాకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.

