కంచుపాడులో సురవరం కుటుంబ సేవలు భేష్: మంత్రి సీతక్క

కలం, జోగులాంబ గద్వాల: నడిగడ్డలోని సురవరం కుటుంబానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, కంచుపాడు గ్రామంలో వారి కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. శుక్రవారం ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడుతో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు.

44వ జాతీయ రహదారి నుంచి కంచుపాడుకు రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రహదారికి, విబి జీరాంజీ పథకంలో భాగంగా రూ.30.22 కోట్ల నిధులతో ఆలంపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే 323 పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఇక్కడి సురవరం సుధాకర్ రెడ్డి హాల్, గ్రంథాలయం, క్రీడ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాలను కలియ తిరుగుతూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. విజ్ఞాన కేంద్రంలో యువతకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడమే కాక మహిళలకు రామనంద తీర్థ ట్రస్ట్ సహకారంతో టైలరింగ్, ఇతర ఉపాధి రంగాల్లో రాణించేందుకు తర్ఫీదు నివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రంథాలయాన్ని కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, గ్రామ సర్పంచ్ నాగ లక్ష్మమ్మ, విజ్ఞాన కేంద్రం ప్రతినిధి విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>