కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం (Ayyappa Temple) లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో అయ్యప్ప మాల ధరించిన తన కుమారుడు అర్జున్ జాదవ్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి, శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు తన కుటుంబంతో పాటు బోథ్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి కౌట ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>