వాకర్స్‌కు వరంగల్ సీపీ కీలక సూచన.. ఆ మైదానాల్లోకి నో ఎంట్రీ!

కలం, వెబ్ డెస్క్ : సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల నియామక ప్రిలిమినరీ రాత పరీక్షల నేపథ్యంలో ట్రై సిటీ పరిధిలోని వాకర్స్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత (Warangal CP Swetha) ఐపిఎస్ కీలక సూచనలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ కమిషనరేట్ ట్రై సిటీ పరిధిలోని 32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా ఎంపికైన పాఠశాలలు, కళాశాలల మైదానాల్లో వాకర్స్‌కు తాత్కాలికంగా అనుమతి ఉండదని సీపీ ఎన్ శ్వేత స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి 29వ తేదీ ఆదివారం ఉదయం వరకు కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ హై స్కూల్, హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ డిగ్రీ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానాల్లో వాకింగ్‌కు రావద్దని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్, ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>