కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ (Khairatabad GHMC) ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆఫీస్ లోపలి నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో ఫైళ్లు, ఇంకా ఏమైనా విలువైన వస్తువులు కాలిపోయాయా.. లేదా.. అనేది తెలియరాలేదు. సమాచారం తెలిసిన వెంటనే జోనల్ కమిషనర్ సహా ఇతర అధికారులు కార్యాలయానికి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

