జెడ్పి సీఈవోగా అదనపు కలెక్టర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు

కలం, నిర్మల్:  నిర్మల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (Nirmal ZP CEO)గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన జెడ్పీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని కలెక్టర్ తెలిపారు. తన సాధారణ విధులతో పాటు జెడ్పీపీ కార్యాలయ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>