అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన గుడిసెలపేట్ విద్యార్థినులు!

కలం, జగిత్యాల: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో భాగంగా ఈ నెల 24వ తేదీన ఎన్టీపీసీలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలలో గుడిసెలపేట్ గ్రామానికి చెందిన ZPHS పాఠశాల విద్యార్థులు (Godishelapet Students) ప్రతిభ చాటారు. లాంగ్ జంప్ విభాగంలో యం.సహస్ర బంగారు పతకం సాధించగా, కె. సాయిశ్రియ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ఇద్దరూ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారు. లాంగ్ జంప్ పోటీలలో తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులు ZPHS పాఠశాలకు, గుడిసెలపేట్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదల, కోచ్ అందించిన శిక్షణతో వారు ఈ విజయాన్ని అందుకున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల గ్రామస్థులు, పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులు సాధించిన విజయంపై గుడిసెలపేట్ గ్రామ సర్పంచ్ అమృత రాజేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయ, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. విజయం సాధించిన సహస్ర, సాయిశ్రియలను ప్రత్యేకంగా అభినందించారు. వారికి శిక్షణ అందించిన కోచ్ కిషోర్‌ను కూడా ప్రశంసించారు. రాష్ట్ర స్థాయి పోటీలలోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయి అథ్లెట్లుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. కాగా, రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 30వ తేదీన నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీలలో సహస్ర, సాయిశ్రియ తమ ప్రతిభను మరోసారి చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>