రైతులకు భరోసా ఏది.. బోనస్ ఎక్కడ?: ఎర్రబెల్లి

కలం, వరంగల్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో భద్రకాళి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించామని, రెండు పంటలకు సంబంధించిన బోనస్ కూడా ఖాతాల్లో జమ కాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చెల్లింపుల్లో జాప్యం చేస్తోందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాల అమలులోనూ అనేక మందికి ప్రయోజనం అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>