రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి: సీపీఐ

కలం, యాదగిరిగుట్ట: దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను నిత్యజీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, పట్టణ కార్యదర్శి, కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారు, మాటూరి మల్లయ్య, గుండు వెంకటేష్, బోదాసు జగన్, కాటం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>