కలం, నిర్మల్: దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్య విలువలకు భారత రాజ్యాంగమే పునాది అని బీజేపీ నిర్మల్ (Nirmal) జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్మల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ (BJP Rally) నిర్వహించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడికి మార్గదర్శకమని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ దేశ అభివృద్ధి, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రాంనాథ్, కూనింటి అంజు కుమార్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్నరెడ్డి, రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, రమేష్, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సర్పంచ్ రాచకొండ సాగర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాదు ప్రభాకర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బడి పోతన్న, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాదవ్ పండిట్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జక్కుల సత్తయ్య, ఎండోమెంట్ సెల్ జిల్లా కన్వీనర్ కందుల హరీష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల కల్పన, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కత్తి సుధాకర్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

