మృత్యుంజయుడు.. రెండు కార్లు ఢీకొన్నా సేఫ్‌!

కలం, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ద్విచక్ర వాహనదారుడిని వరుసగా రెండు కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అతడు గాల్లోకి ఎగిరిపడినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. రంగంపేట మండలం పెదరాయవరం (Pedarayavaram) సమీపంలోని ఏడీబీ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సామర్లకోటకు చెందిన సాలిక నవీన్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రహదారిపై మలుపు తిరుగుతుండగా వేగంగా వచ్చిన రెండు కార్లు అతడి వాహనాన్ని ఢీకొట్టాయి. దీంతో నవీన్‌ అదుపుతప్పి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : మ‌ద్దిమ‌డుగు హ‌నుమాన్ ఆల‌యంలో సీఎం పూజ‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>