అటవీ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి కాకూడదు: ఎమ్మెల్యే కూనంనేని

​కలం, ఖమ్మం బ్యూరో : తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులందరికీ తక్షణమే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అధికారులను ఆదేశించారు. అటవీ నిబంధనలు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకం కాకూడదని, అధికారులు సమన్వయంతో పనిచేసి గిరిజన పల్లెల ప్రగతికి సహకరించాలని ఆయన స్పష్టం చేశారు.

​గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల ఉమ్మడి పంచాయతీ పరిధిలో గల రేగళ్ల, పెద్దతండా, హరియాతండా, దూదియాతండా, బావోజితండా, గట్టుమళ్ల గ్రామపంచాయతీల్లో ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గిరిజన గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పట్టాల జారీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించి, గిరిజనులకు భూమి హక్కు పత్రాలు అందించాలని సూచించారు.

​పర్యటనలో భాగంగా పలు కీలక మౌలిక వసతుల పనులకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం హరియాతండా నుంచి కరకవాగు వరకు ఉన్న సింగల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు, అలాగే అల్లూరి సెంటర్ నుంచి పాండురంగాపురం వరకు రహదారుల వెడల్పు పనులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని అన్నారు. వీటితో పాటు కొత్తగూడెం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే కిన్నెరసాని నూతన పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించి 2.5 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాను చేసిన ఈ ప్రతిపాదనల పట్ల అటవీశాఖ అధికారులు సానుకూలంగా స్పందించి అంగీకరించారని ఎమ్మెల్యే తెలిపారు. ​ఈ పర్యటనలో డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎఫ్‌డీఓ బాబు, రేంజర్ కనకమ్మ, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, రామకోటి, కోబాల్, హరి, డాక్టర్ రవి, పూర్ణ, బాలాజీ, రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>