వార్ రూం నుంచే విధులు.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో డిసెంబర్ 7 నుంచి ఫ్యూచర్ సిటీలో మూడు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై ప్రజాభవన్‌లోని వార్ రూమ్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సదస్సు పూర్తయ్యే వరకు అధికారులంతా వార్ రూమ్ నుంచే విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1,700 మందికి పైగా ప్రముఖుల హాజరు ఖరారు కాగా, మరో 1,300 మంది అతిథులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను మించేలా ఇక్కడ సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో తెలంగాణ స్క్వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>